22 ఏళ్లు.. ఫస్ట్ టైం.. IPS అయిన యువతి.. ఎలా సాధ్యం

22 ఏళ్లు.. ఫస్ట్ టైం.. IPS అయిన యువతి.. ఎలా సాధ్యం

భారతదేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష. IRS, IPS, IFS, IAS అభ్యర్థులు సంవత్సరాల తరబడి చదువుతే గానే జాబ్ కొట్టలేరు. అలాంటిది..  ఒడిశాకు చెందిన కామ్యా మిశ్రా అనే యువతి ఫస్ట్ అటెంమ్ట్ లోనే యూపీఎస్సీ ఎగ్జామ్ లో ర్యాంక్ సాధించింది. అది కూడా 22ఏళ్లకే. UPSC పరీక్షలో AIR 172 స్కోర్ చేసిన తర్వాత ఆమె ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) 2019కి ఎంపికైంది. కామ్యా తెలివైన విద్యార్థి. ఇంటర్మీడియేట్ లో 98.6 శాతం స్కోర్‌తో లోకల్ టాపర్‌గా నిలిచింది. తర్వాత కామ్య ఢిల్లీ యూనివర్సిటీలో చేరింది. 

లేడీ శ్రీరాం కాలేజీలో చదువు పూర్తి చేసింది. చదువుకుంటూనే యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకుంది. క్యామా ఫస్ట్ హిమాచల్ కేడర్‌కు కేటాయించారు, తరువాత బీహార్ కేడర్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు. 2021లో  ఆమె బీహార్ కేడర్‌కు చెందిన IPS అధికారి అవధేష్ సరోజ్‌ని వివాహం చేసుకుంది. అవధేష్ బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్.